కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- September 13, 2025
యూఏఈ: యూఏఈలో వర్క్ సైట్ లో పనిచేస్తున్న సమయంలో ప్రమాదానికి గురైన కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం అందనుంది. ఈ మేరకు అబుదాబి కాసేషన్ కోర్టు తీర్పును వెలువరించింది. వర్క్ సైట్ లో భద్రతా పరమైన నిబంధనలు అమలు చేయడంలో యాజమాన్యం విఫలమైందని కోర్టు ఆక్షేపించింది.
కాగా, ప్రమాదానికి గురైన కార్మికుడు తనకు జరిగిన నష్టానికి Dh10 మిలియన్ల పరిహారం కోరుతూ ముందుగా యాజమాన్యంపై సివిల్ కేసు వేశాడు. కేసును విచారించిన అబుదాబి ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు కార్మికుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. తనకు జరిగిన నష్టానికి పరిహారంగా 1.1 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
అయితే, ఈ తీర్పుపై సంతృప్తిగా లేని కార్మికుడు అప్పీల్ చేసుకున్నాడు. దాంతో కేసును విచారించిన అబుదాబి కాసేషన్ కోర్టు పరిహార డబ్బును 1.5 మిలియన్ దిర్హామ్‌లకు పెంచుతూ సెప్టెంబర్ 10న తీర్పును వెలువరించింది.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం