జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- September 13, 2025
జెడ్డా: సౌదీ అరేబియా జ్యువెలరీ ఎక్స్ పోజిషన్ (SAJEX 2025) జెడ్డాలో సూపర్‌డోమ్‌లో ప్రారంభమైంది. ఇందులో ఇండియా, ఇతర దేశాల నుండి 200 కంటే ఎక్కువ మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. జ్యువెలరి, జెమ్స్ మరియు సరికొత్త డిజైన్ల ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు.
జెడ్డాలో భారత కాన్సులేట్ జనరల్, రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో ఇన్వెస్ట్ సౌదీ మరియు జెద్దా, మక్కా వాణిజ్య మండలి మద్దతుతో జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
జెమ్స్ మరియు జ్యువెలరీ రంగంలో ఇండియా- సౌదీ అరేబియా మధ్య బలమైన సహకారం ఉందని కౌన్సిల్ చైర్మన్ కిరీట్ భన్సాలీ అన్నారు. వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడానికి జ్యువెలరీ క్స్ పొజిషన్ ఒక వేదికను అందిస్తుందని సౌదీ ఇన్వెస్ట్ మెంట్ మంత్రిత్వ శాఖకు చెందిన ఖలీద్ అల్ షెడ్డీ అన్నారు.
ఇక సౌదీ అరేబియాలోని భారత రాయబారి డాక్టర్ సుహెల్ అజాజ్ ఖాన్ మాట్లాడుతూ.. భారత్, సౌదీ ఆర్థిక వ్యవస్థల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. సౌదీ అరేబియా జ్యువెలరీ ఎక్స్ పోజిషన్ విజయం సాధించాలని భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తను పంపిన మెసేజులో ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం