ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- September 15, 2025
న్యూ ఢిల్లీ: ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్ ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే వారికి బిగ్ అలర్ట్.. కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. సెప్టెంబర్ 15 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ లావాదేవీల పరిమితుల్లో కీలక మార్పులు చేసింది. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారనున్నాయి.
చిరు వ్యాపారుల నుంచి వినియోగదారుల వరకు ఉపయోగపడేలా యూపీఐ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తీసుకొచ్చింది. కీలక రంగాల్లో పెద్ద చెల్లింపులను సులభంగా చేయడం లక్ష్యం పెట్టుకుంది. అయితే, వ్యక్తి నుంచి వ్యక్తి చెల్లింపులకు రోజువారీ పరిమితి లక్ష వరకు ఉంటుంది. అందులో ఏ మాత్రం మార్పులు లేవు.
కొత్త రూల్స్ ప్రకారం.. ప్రధానంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, బీమా ప్రీమియం, ఈవీఎం, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు వంటి లావాదేవీలకు వర్తిస్తుందని ఎన్పీసీఐ స్పష్టం చేసింది.
కొత్త రూల్స్ ప్రకారం.. ఒక్క ట్రాన్సాక్షన్ లో రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు.ట్రావెల్ బుకింగ్స్, హోటల్ ఖర్చులు, ప్లైట్ టికెట్స్ వంటివి ఒక ట్రాన్సాక్షన్ లో రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు.ప్రభుత్వం ఈ-మార్కెట్ ప్లేస్ లో 5లక్షల నుంచి 10లక్షల వరకు చెల్లించుకోవచ్చు.క్రెడిట్ కార్డు బిల్స్ చెల్లించడంలో టెన్షన్ అవసరం లేదు. ఒకేసారి 5లక్షల నుంచి 6లక్షల వరకు క్రెడిట్ కార్డు బిల్లులు క్లియర్ చేయొచ్చు.
ఆభరణాలు కోసం అయితే రెండు లక్షల నుంచి ఆరు లక్షల వరకు చెల్లించుకోవచ్చు.
బిజినెస్ లేదా మర్చంట్ పేమెంట్స్ కు రూ.5లక్షల వరకు ఒకేసారి ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఈ కేటగిరీలో రోజువారీ లిమిట్ లేదు.
ఎఫ్‌ఎక్స్ రిటైల్ కేవలం ఐదు లక్షల వరకు మాత్రమే ఉంటుంది.
టర్మ్ డిపాజిట్ల కోసం డిజిటల్ అకౌంట్ ఓపెన్‌కు ఐదు లక్షల వరకు ఉంటుంది.
డిజిటల్ అకౌంట్ ఓపెన్ – ఇనీషియల్ ఫండింగ్ రోజుకు రెండు లక్షల వరకు మాత్రమే ఉండనుంది.డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా మార్పులు డిజిటల్ ఇండియాను మరింత బలోపేతం చేస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం