'భద్రకాళి' యూనిక్ పొలిటికల్ థ్రిల్లర్: హీరో విజయ్ ఆంటోనీ

- September 15, 2025 , by Maagulf
\'భద్రకాళి\' యూనిక్ పొలిటికల్ థ్రిల్లర్: హీరో విజయ్ ఆంటోనీ

హీరో విజయ్ ఆంటోనీ 'మార్గన్' విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌ 'భద్రకాళి'తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు.ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్,  మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కనెక్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, రాణా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.  'భద్రకాళి' సెప్టెంబర్ 19న రిలీజ్  కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. భద్రకాళి సినిమాతో మీ అందరి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అరుణ్ ప్రభు లాంటి డైరెక్టర్ తో వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. పదేళ్ల క్రితమే ఆయన తీసిన అరువి  సినిమా చూశాను .అద్భుతమైన సినిమా. నా అభిప్రాయం ప్రకారం ఇండియాలో టాప్ టెన్ డైరెక్టర్స్ లో ఆయన ఒకరు. చాలా టాలెంటెడ్ పర్సన్. ఈ సినిమాతో పాన్ ఇండియా ఆయన విజన్  రీచ్ అవుతుంది. కచ్చితంగా ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. నిర్మాత రామ్ గారు నాకు మంచి స్నేహితులు. చాలా సపోర్ట్ చేశారు. వారితో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నాం. రచయిత భాష శ్రీ తెలుగు సంబంధించి అన్ని బాధ్యతలు తీసుకున్నారు. చాలా అద్భుతమైన మాటలు రాశారు. హీరోయిన్స్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన సపోర్ట్ వల్లే ఆంధ్ర తెలంగాణలో ఇంత గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. మా టీంలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.సెప్టెంబర్ 19న ఈ సినిమాని చాలా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. కచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు.  

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. భద్రకాళి సినిమాని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. విజయ్ ఆంటోనీ మల్టీ టాస్కింగ్ ని చాలా అద్భుతంగా చేస్తూ మంచి ప్రోడక్ట్స్ అందిస్తున్నారు.ఈ క్రమశిక్షణ ఆయన్ని గొప్పస్థాయికి తీసుకు వెళుతుంది. రామాంజనేయులుకి ఆల్ ది వెరీ బెస్ట్. అరుణ్ వెరీ గుడ్ ఫిలిం మేకర్. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ సో మచ్.  

డైరెక్టర్ అరుణ్ ప్రభువు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ.ఈ సినిమా మీ అందరి అంచనాల్ని అందుకుంటుంది.ఇది మంచి పొలిటికల్ థ్రిల్లర్. ఇది ఏ రాష్ట్రానికో దేశానికి సంబంధించిన పాలిటిక్స్ కాదు. ఇది  పీపుల్ పాలిటిక్స్. అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది. విజయ్ అంటోని 25వ సినిమాగా భద్రకాళి రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ అంటోనీకి ధన్యవాదాలు. నిర్మాత రామ్ గారు చాలా సపోర్ట్ చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  

ప్రొడ్యూసర్ రామాంజనేయులు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.మా వేడుకకు అతిథిగా వచ్చిన సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో  ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా రిలీజ్ చేస్తున్నాము. మార్గన్  మూవీ ఇదే కాంబినేషన్లో రిలీజ్ చేసి చాలా సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. విజయ్ గారు నేను ఇద్దరం కలిసి కొన్ని సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాం.అందులో భాగంగా ఫస్ట్ మూవీ మార్గన్  రిలీజ్ అయింది. ఇప్పుడు రెండు మూవీ భద్రకాళి వస్తోంది.  ఇటీవల బూకీ సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేశాం. ఇలా కంటిన్యూగా కొన్ని ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. విజయ్  గారి డెడికేషన్ హార్డ్ వర్క్ తో భద్రకాళి సినిమా ఇంత గ్రాండ్ గా వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ కి చాలా బాగా నచ్చుతుంది. విజయ్ గారు ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకి ప్రత్యేకంగా ఉంటుంది. డైరెక్టర్ అరుణ్ సమాజంలో చాలా కీలకమైన అంశాలను ఒక సందేశాత్మకంగా కూడా డీల్ చేశారు. అరుణ్ ఈ సినిమాకి బ్యాక్ బోన్. ఆయన విజన్ తోనే అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.  

హీరోయిన్ తృప్తి రవీంద్ర మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.ఈ వేడుకకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయం విజయ్,అరుణ్ కి ధన్యవాదాలు. ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నిర్మాత రామ్ కి ధన్యవాదాలు. ఈ సినిమాలో పార్ట్  కావడం చాలా ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 19న ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.

హీరోయిన్ రియా మాట్లాడుతూ.. అందరికీ మా నమస్కారం. భద్రకాళి సినిమా నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ని ఇచ్చింది. ఈ సినిమా నాకు తెలుగు భాషని తెలుగు ప్రేక్షకుల్ని పరిచయం చేసింది. విజయ్ గారితో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అరుణ్ ప్రభు గారికి నిర్మాత రామ్ గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది.  

రైటర్ భాష శ్రీ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం  భద్రకాళి ఇమంచి పొలిటికల్ సెటైర్. అందరికీ చాలా బాగా నచ్చుతుంది .విజయ్ ఆంటోని ఇందులో విశ్వరూపం చూపించారు. అరుణ్ అద్భుతంగా తీశారు.ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక జెంటిల్మెన్, శంకర్ సినిమా స్థాయిలో అనిపించింది. నాకు ఈ సినిమాలో భాగం చేసినందుకు విజయ్ అంటోనికి. మా డైరెక్టర్, మా నిర్మాత రామ్ కి ధన్యవాదాలు. సెప్టెంబర్ 19న సినిమా వస్తుంది. డెఫినెట్ మీ అందరికీ నచ్చుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com