యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- September 16, 2025
యూఏఈ: 35 ఏళ్ల ఇరాకీ ప్రవాసి అలీ నిహాద్ అబ్దులతీఫ్ అల్ తయ్యర్ ను Dh1 మిలియన్ యూఏఈ లాటరీ వరించింది. ఇది మాటలకు అందని అనుభూతి అని అతను అన్నాడు. గత కొంత కాలంగా తాను అనుభవించిన కష్టాలను సెప్టెంబర్ 6 డ్రా దూరం చేస్తుందన్నారు. లాటరీ విజయాన్ని ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన కూతురు పుట్టిన రోజు, మరియు తన తండ్రి పుట్టిన రోజు కాంబినేషన్ లో ఎంచుకున్న 5, 11, 14 నంబర్లు తన తలరాతను మార్చాయని తెలిపాడు.
ఐదు సంవత్సరాలుగా యూఏలో నివసిస్తున్న అలీ, అజ్మాన్‌లో వాజే అల్ జమాల్ పెర్ఫ్యూమ్స్ & కాస్మెటిక్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తున్నాడు. ప్రతి రెండు వారాలకు తన భార్యతో కలిసి టిక్కెట్లు కొంటానని, అందుకోసం 200 దిర్హమ్స్ ను కేటాయిస్తానని వివరించాడు.
గత సంవత్సరం డిసెంబర్‌లో ప్రారంభమైన యూఏఈ లాటరీ 100 నుండి 100 మిలియన్ల దిర్హమ్స్ వరకు బహుమతులను అందిస్తుంది. 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉన్నవారు ఇందులో పాల్గొనవచ్చు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!