కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- September 16, 2025
రియాద్: సౌదీ అరేబియాలో కొత్త రోడ్ ట్రాన్స్ పోర్ట్ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. లైసెన్స్ లేకుండా ప్రయాణీకులను తరలించడాన్ని నిషేధించారు. ఈ మేరకు ట్రాన్స్ పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇకపై వాహన డ్రైవర్లు ప్రయాణీకులను పిలవడం, వారిని అనుసరించడం లేదా అడ్డగించడం, ప్రయాణీకుల ప్రాంతాలలో గుమిగూడడం వంటి అనధికార కార్యకలాపాలలో పాల్గొనడం నిషేధించినట్లు అథారిటీ తెలిపింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 11వేల సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధిస్తారు. అదే లైసెన్స్ లేకుండా ట్రాన్స్ పోర్టు సేవలను అందిస్తే జరిమానా కింద 20వేల సౌదీ రియాల్స్ , 60 రోజుల వరకు సదరు వెహికిల్ ను సీజ్ చేస్తారని అథారిటీ హెచ్చరించింది. అలాగే, ప్రవాస డ్రైవర్లుంటే వారిని దేశం నుంచి బహిష్కరిస్తారని వెల్లడించింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!