మమ్ముట్టికి కేరళ మహిళా కమిషన్ నోటీసులు జారీ..
- July 20, 2016
మలయాళీ టాప్ హీరో మమ్ముట్టికి కేరళ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయన నటించిన 'కసాబా' సినిమాలో మహిళలను కించపరిచారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మమ్ముట్టితో పాటు చిత్ర నిర్మాత, దర్శకుడికి నోటీసులు ఇచ్చింది.'కసాబా' సినిమాలో మహిళలను అగౌరపరిచేలా డైలాగులు, దృశ్యాలు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో నోటీసులు జారీ చేశామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ కే రోసకుట్టి టీచర్ తెలిపారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో మహళలను కించపరచడం తగదని ఆమె అన్నారు. మమ్ముట్టి లాంటి పెద్దహీరో సినిమాల్లో ఇలాంటి దిగజారుడు డైలాగులు చెప్పడం, సన్నివేశాల్లో నటించడం సరికాదన్నారు. మహిళలను కించపరిచే డైలాగులు, సన్నివేశాలు లేకుండా చూడాలని సెన్సార్ బోర్డు, మలయాళం నటీనటుల సంఘం, సినీ టెక్నిషియన్స్ అసోసియేషన్ కు లేఖలు రాయాలని నిర్ణయించినట్టు చెప్పారు. రంజాన్ సందర్భంగా విడుదలైన 'కసాబా' హిట్ టాక్ సొంతం చేసుకుంది. డ్యూటీలో ఉన్న సీనియర్ మహిళా పోలీసు అధికారిని హెచ్చరించే సన్నివేశంలో అభ్యంతకర డైలాగులు ఉన్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం









