‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీజర్ వచ్చేసింది..
- September 16, 2025
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్ష్సన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మాణంలో రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నవంబర్ 7న ఈ సినిమా రిలీజ్ కానుంది.
తాజాగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి విజయ్ దేవరకొండ, శేఖర్ కమ్ములతో టీజర్ రిలీజ్ చేయించారు. విజయ్ దేవరకొండ ఈ సినిమా టీజర్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రపంచానికి నేను తెలిసే కంటే ముందే తిరువీర్ గురించి నాకు తెలుసు. తను కలల ప్రపంచంలో జీవించటాన్ని చూసి నేను సంతోషపడుతుంటాను. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీజర్ చాలా ఆసక్తికరంగా చల్లటి గాలి మనసుని హత్తుకున్నట్లు ఉంది అని పోస్ట్ చేసి మూవీ యూనిట్ ని అభినందించారు.
ఇక ఈ టీజర్ చూస్తుంటే ఇప్పుడు పెళ్ళికి ముందు జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కథాంశంతో ఓ ఊళ్ళో ఉండే ఫోటో స్టూడియో, అతను చేసే ప్రీ వెడ్డింగ్ షూట్స్, అతని లవ్ స్టోరీతో సాగుతున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల