శాండీ మాస్టర్ తో మాగల్ఫ్ ముఖాముఖీ
- September 17, 2025
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్ తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన శాండీ మాస్టర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
లియో, లోక ఇప్పుడు కిస్కిందపురి వరుస విజయాలు అందుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది?
-చాలా ఆనందంగా ఉంది. ముందుగా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కి థాంక్స్ చెప్పాలి. ఆయన లియోలో నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వకపోతే ఈ జర్నీ మొదలయ్యేది కాదు.
-చిన్నప్పుడు అందరూ నా కళ్ళను చూసి ఆటపట్టించేవారు. 'డెత్ గోట్ ఐస్' అంటూ టీజ్ చేసేవారు. అయితే ఇప్పుడు అదే నాకు చాలా ఆనందం ఇచ్చింది.నిజంగా నాకు అలాంటి కళ్ళు లేకపోతే లోకేష్ ఆ క్యారెక్టర్ కి నన్ను ఎంపిక చేసేవారు కాదు.విక్రమ్ సినిమాలో ఒక సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాను. అప్పుడే ఆయన లియోలో క్యారెక్టర్ గురించి చెప్పారు.
-లియో తర్వాత నాకు చాలా క్యారెక్టర్లు వచ్చాయి. అన్ని ఒకే తరహ సైకో పాత్రలు చెప్పేవారు. ఇలాంటి సమయంలో లోక, కిష్కింధపురి డిఫరెంట్ సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో వరుస విజయాలను అందుకుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది.
హైదరాబాద్ కి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు?
-ఓంకార్ చేసిన చాలెంజ్ 3 షో తో హైదరాబాద్ కు వచ్చాను. పోతే పోనీ పోరా పాట నాకు చాలా మంచి ఫేమ్ తీసుకొచ్చింది. నాకు హ్యూమర్ సెన్స్ ఉన్న క్యారెక్టర్స్, డాన్స్ పెర్ఫార్మన్స్ అంటే చాలా ఇష్టం.
కిస్కింధపురిలో మీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు మిమ్మల్ని ఆకట్టుకున్న ఎలిమెంట్స్ ఏమిటి?
-డైరెక్టర్ కౌశిక్ ఈ కథని అద్భుతంగా చెప్పారు.అందులో నా క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఆ క్యారెక్టర్ గురించి ఎక్కువ రివిల్ చేయకూడదు.అది ఒక సర్ప్రైజ్ లాగా ఉంచాము.ఈ క్యారెక్టర్ కోసం దాదాపు ఏడు గంటల పాటు టెస్ట్ షూట్ చేశాం. అది డైరెక్టర్ కి చాలా నచ్చింది. ఇలాంటి యూనిక్ క్యారెక్టర్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
కిస్కింధపురితో మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్?
-ఆడియన్స్, ఫ్రెండ్స్ నుంచి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే పా రంజిత్, లోకేష్ కనకరాజు సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేశారు. చాలామంది ఆడియన్స్ థియేటర్స్ లో నాకు క్యారెక్టర్ వచ్చినప్పుడు గ్రేట్ రెస్పాన్స్ ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
డైరెక్టర్ ఈ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఏమైనా రిఫరెన్స్ ఇచ్చారా?
-నాకు రిఫరెన్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు.అయితే గతంలో సూర్య గారు చేసిన ఒక సినిమా ని రిఫరెన్స్ గా ఇచ్చారు.అయితే ఆ క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ కి సంబంధం లేదు.చాలా కొత్తగా ఈ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేయడం జరిగింది.
ప్రొడక్షన్ హౌస్ సపోర్టు ఎలా ఉంది?
- సాహు చాలా స్వీట్ ప్రొడ్యూసర్.ఒక ఫ్యామిలీలో ఒక బ్రదర్ లాగా చూసుకున్నారు.చాలా అద్భుతంగా ట్రీట్ చేశారు. వారి ప్రొడక్షన్స్ లో వర్క్ చేయడం చాలా ఆనందించింది.
యాక్టర్ గా కొరియోగ్రాఫర్ గా ఏ జర్నీ మీకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది?
-కొరియోగ్రఫీ నా బేస్. కచ్చితంగా కొరియోగ్రఫీ చేస్తాను.అయితే ప్రస్తుతం నేను యాక్టింగ్ మీద ఫోకస్ చేశాను.ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ చేయాలని ఉంది. నాకు దర్శకత్వం మీద కూడా ఆసక్తి ఉంది. అయితే దానికి ఇంకా సమయం ఉంది.
మీరు ఒక సినిమాని ఎంచుకోవాలంటే దేనికి ప్రాధాన్యత ఇస్తారు?
-కథ బాగుండాలి.మంచి కథ అయితే తప్పకుండా చేస్తాను.కథ బాగుంటే ఆటోమేటిక్గా క్యారెక్టర్ కూడా బాగుంటుంది.అన్నిటికీ పునాది మంచి కథ.
కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి?
-పా రంజిత్ నిర్మాణంలో హీరోగా ఒక సినిమా చేస్తున్నాను. మలయాళం లో కథామినార్ లో ఒక కీలక పాత్ర చేస్తున్నాను. ఓజీలో ప్రమోషనల్ సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాను.
తాజా వార్తలు
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం