కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- September 17, 2025
కువైట్ః కువైట్ లో 2025–2026 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసఫ్ ఆదేశాల మేరకు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ అల్-అద్వానీ ట్రాఫిక్ సమస్యలను పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు సమస్యలు లేకుండా స్కూళ్లకు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఏవైనా ఉల్లంఘనలు ఉంటే కఠినంగా వ్యవహారించాలని సూచించారు. స్కూల్ సమయాలలో సిబ్బంది పర్యవేక్షణను పెంచాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ట్రాఫిక్ అధికారులతో పూర్తిగా సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







