బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- September 17, 2025
మనామాః బహ్రెయిన్ లో సంచలనం సృష్టించిన సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసులో 10మందిని దోషులుగా తెలుస్తూ.. ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వారికి ఒక సంవత్సరం నుండి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించింది. ఇద్దరు నిందితులకు ఒక్కొక్కరికి లక్ష బహ్రెయిన్ దినార్ల జరిమానా, మిగిలిన నిందితులకు ఒక్కొక్కరికి 500 బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించారు.సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ మరియు లేబర్ ఫండ్ “టామ్కీన్” యొక్క ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని సమర్పించినందుకు, అలాగే రెండు సంస్థల నుండి రెండు లక్షల ముప్పై వేల బహ్రెయిన్ దినార్ల కంటే ఎక్కువ డబ్బును దుర్వినియోగం చేయడానికి అధికారిక పత్రాలను ఫేక్ చేసినందుకు నిందితులు కోర్టు దోషులుగా నిర్ధారించింది. నిందితులు నకిలీ పత్రాలను సమర్పించి, బీమా దారుల పేర్లలో మార్పులు చేసి ఎలక్ట్రానిక్ వ్యవస్థను తారుమారు చేశారని, తద్వారా వారు సామాజిక బీమా హక్కుల నుండి ప్రయోజనం పొందారని కోర్టు తెలిపింది. ఇలా ఉద్యోగులకు సంబంధించి పదవీ విరమణ పెన్షన్లు, సేవ ముగింపు బోనస్‌లు మరియు వారు పొందలేని వన్-టైమ్ పరిహారాలను క్లెయిమ్ చేసుకుని నిధులను పొందారని తన తీర్పులో కోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం