ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!

- September 17, 2025 , by Maagulf
ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!

రియాద్ః ఇజ్రాయెల్ దురాక్రమణ విధానాలను సౌదీ అరేబియా క్యాబినెట్ తీవ్రంగా ఖండించింది. రియాద్‌లో క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన సౌదీ అరేబియా క్యాబినెట్ సమావేశం జరిగింది. మిడిలీస్టులో ఇజ్రాయెల్ వరుస దాడులను తీవ్రంగా ఖండించింది. ఖతార్ కు సంఘీభావాన్ని ప్రకటించారు. దాని సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకునే అన్ని చర్యలకు మద్దతు ఉంటుందని తెలిపింది. అత్యవసర అరబ్-ఇస్లామిక్ సమ్మిట్‌ సంయుక్త ప్రకటనను స్వాగతించారు. పాలస్తీనా సమస్యకు టూ స్టేట్ పరిష్కారాన్ని ఆమోదిస్తూ ప్రవేశపెట్టిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లి న్యూయార్క్ ప్రకటనను సౌదీ క్యాబినెట్ స్వాగతించింది. సూడాన్‌లో శాంతి మరియు భద్రత పునరుద్ధరణకు సంబంధించి సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విదేశాంగ మంత్రుల ఉమ్మడి ప్రకటనకు మంత్రివర్గం తన మద్దతును వ్యక్తం చేసింది. ఇది సూడాన్ ప్రజలు ఎదుర్కొంటున్న మానవతా విషాదాన్ని తొలిగేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. వీటితోపాటు పలు నిర్ణయాలకు సౌదీ క్యాబినెట్ ఆమోదించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com