ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ బహ్రెయిన్ ఆధ్వర్యంలో గల్ఫ్ బాధితునికి సహాయం.
- July 20, 2016
ఉపాధి కోసం గత రెండున్నర సంవత్సరాల క్రితం బహ్రెయిన్ కు వచ్చిన భైరగోని సంజీవ్ గౌడ్ వయస్సు (24) గ్రామం ఖానాపూర్ మండలం , జిల్లా నిజామాబాద్ మన తెలంగాణకు చెందిన యువకుడు బహ్రెయిన్ లో ఒక ప్రైవేట్ కంపెనీ లేబర్ గా పనిచేస్తున్న యువకుడు ఆరోగ్యం బాగులేక ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్తే కడుపులో కంతి ( ఫెరలల్ లాప్స్ ) పెరగడం వల్ల కంపెనీ బాధ్యత తీసుకోలేదు, మరి కొన్ని కారణాల వల్ల ఇంటికి వెళ్ళడానికి టికెట్ ఇవ్వకపోవడం రెండున్నర సంవత్సరాలు అయినా లీవ్ జీతం మరియు గత రెండునెలల జీతం ఇవ్వలేదు వెళ్ళడానికి చిల్లి గవ్వలేక కంపెనీ పట్టించుకోక ఉన్న పరిస్థితిలో ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ కమిటీ ని ఆశ్రయించి తన గోడు విన్నవించుకున్నాడు. కమిటీ సభ్యులు ముందుకు వచ్చి తమ వ్యక్తిగతంగా అందరూ కలిసి ప్రయాణ టికెట్ ను కొనిచి తేదీ 19/07/16 మంగళవారం రోజునసాయంత్రం హైద్రాబాద్ కు పంపడం జరిగింది.ఆపదలో ఉన్న వారికి ముఖ్యంగా తెలంగాణ కార్మికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు .
ఈ కార్యక్రమం లో ఎన్నారై టి.ఆర్.ఎస్. నాయకులు గల్ఫ్ కో ఆర్డినేటర్ సతీష్ కుమార్ రాధారపు, ఇంచార్జ్ వెంకటేష్ బొలిశెట్టి, నాయకులు డా"రవి, చైతన్య, ప్రశాంత్, సదానంద్, గంగాన్న, గట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







