దోహా లో మొండికేస్తున్న ఎయిర్ కండిషనర్లు..వెల్లువెత్తుతున్న మరమ్మతులు
- July 20, 2016
దోహా లో ఈ వేసవి అత్యధిక ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎయిర్ కండిషనర్లు మరమ్మత్తు మరియు నిర్వహణ సేవా కేంద్రాల వద్ద బుకింగ్స్ ఉన్నట్లుండి అమాంతంగా నమోదు కాబడినట్లు తెలిసింది.బుకింగ్స్ సాధారణంగా సంవత్సరంలో ఇతర నెలల పోలిస్తే వేసవిలో 50 శాతం పెరుగుతుందని ఒక ప్రముఖ దక్షిణ కొరియా బ్రాండ్ ఆధరైజ్డ్ సేవాకేంద్రం ఒక టెక్నీషియన్ గా పనిచేసే ఫెర్నాం .చెప్పారు. ఎయిర్ కండిషనర్ల యొక్క సాధారణ భాగాలైన కంప్రెసర్, కెపాసిటర్, మరియు కంప్రెసర్ యొక్క అంత్య క్లిప్ ప్రస్తుత వేడి వాతావరణంలో దెబ్బ తింటున్నట్లు ఆరోపిస్తున్నారు ఎయిర్ కండిషనర్ల యొక్క సాధారణ భాగాలని రెగ్యులర్ నిర్వహణతో జీవితకాలం కొనసాగింపు మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా ఎయిర్ కండిషనర్లు ఉపయోగిస్తారు. విపరీతమైన వేడి కారణంగా బాహ్య యూనిట్లు ఎక్కువగా నష్టం వాటిల్లడంతో బాధపడుతున్నారని వివరించారు. ఎయిర్ కండిషనర్ల యజమానులు వేసవి ప్రారంభానికి ముందే కంప్రెసర్ ఎక్కువగా పని చేయడం దృష్ట్యా మందు వేసవిలో మొరాయించడం నివారించేందుకు "నివారణ నిర్వహణ" కోసం నిపుణుని వద్దకు తీసుకుపోవాలని అన్నారు. ఈ మరమ్మతు కోసం సేవాకేంద్రం సేవలని పొందేందుకు ముందే సంప్రదించాలనితద్వారా వేసవి కాలం తలెత్తే అవాంతరం తొలగిస్తుందని ఫెర్నాం తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







