హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- September 20, 2025
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1బీ వీసా దరఖాస్తు ఫీజు లక్ష డాలర్ల(రూ.88లక్షలు) కు పెంచడంతో అక్కడ నివసిస్తున్న భారతీయుల నెత్తిన పిడుగుపడ్డట్టు అయింది. ట్రంప్ నిర్ణయం వల్ల అప్పుడే భారతీయుల్లో ఆందోళన మొదలైంది. మైక్రోస్టాఫ్, అమెజాన్, టీసీఎస్, ఆపిల్ వంటి టెక్ దిగ్గజాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. హెచ్ 1బీ వీసా దరఖాస్తులలో 70శాతానికి పైగానే భారతీయులే ఉండడం గమనార్హం. ఈ కంపెనీలు తమ వ్యాపార అవసరాల కోసం, ముఖ్యంగా భారత్ వంటి దేశాల నటుండి అధిక సంఖ్యలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానికి హెచ్ 1బీ వీసాలపై ఎక్కువగా ఆధారపడతాయి. ఈ కొత్త నిబంధనల వల్ల ఈ కంపెనీలు భారీగా ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుంది.
సాధారణంగా హెచ్ 1బీ వీసా ఫీజును కంపెనీలే భరిస్తాయి. ఇప్పటివరకు ఈ ఖర్చు కొన్నివేల డాలర్లలో ఉండేది. అయితే ఇప్పుడు ప్రతి ఉద్యోగికి లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి వస్తే, ఈ కంపెనీల నియామక ఖర్చులు ఆకాశాన్నంటుతాయి. అమెజాన్, మైక్రోసాఫ్ వంటి కంపెనీలు ఏటా వేలసంఖ్యలో హెచ్ 1బీ వీసాలను స్పాన్సర్ చేస్తాయి. ఈ భారీ పెంపుదల వల్ల ఆయా కంపెనీలు ఏటా వందల కోట్ల డాలర్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది వారి లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ట్రంప్ ప్రభుత్వం ఈ మార్పులు తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశం అమెరికన్ ఉద్యోగాలను పరిరక్షించడం. హెచ్ 1బీ వీసా ప్రోగ్రాము దుర్వినియోగం చేస్తూ తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను(Foreign employees) నియమించుకుంటున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కొత్త ఫీజు వల్ల కంపెనీలు అమెరికన్లను నియమించుకోవడం వైపు మొగ్గ చూపుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ట్రంప్ నిర్ణయం వల్ల భారతీయ ఐటీ నిపుణులలో, విద్యార్థులలో, కంపెనీలలో తీవ్ర ఆందోళన కలుగుతున్నది. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే యోచనలో కంపెనీలు ఉన్నాయి. ఈ అధిక ఫీజు వల్ల కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి వెనకడుగు వేయవచ్చు.
దీంతో భారతీయు ఐటీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగావకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు ట్రంప్ రోజుకో విధానం వల్ల తలలు పట్టుకుంటున్నారు. ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకునివస్తుందో తెలియక అయోమయస్థితి ఉన్నారు. క్రమంగా తమ డాలర్ కలలు కరిగిపోతున్నాయని వాపోతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు