'తొలికిరణం' చిత్రం
- July 20, 2016
పి.డి.రాజు ఏసుక్రీస్తుగా జె.జానబాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'తొలికిరణం'. అభినయ మేరీమాతగా నటించగా భానుచందర్, సాయికిరణ్, సురేఖావాణి కీలక పాత్రలు పోషించారు. టి. సుధాకర్ నిర్మాత. చిత్రీకరణ పూర్తైంది. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ''ఏసుక్రీస్తూ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటి వరకు వచ్చిన క్రీస్తూ చిత్రాల్లో లేని కొత్త అంశాల్ని ఇందులో చూపిస్తున్నాం. ఆయన సమాధి అయ్యి తిరిగొచ్చిన తర్వాత మానవాళికి ఎటువంటి సందేశాలిచ్చారు అన్నది ఈ చిత్రంలో కీలకం. ఇజ్రాయిల్, జెరుసలెం వంటి ప్రాంతాల్లో క్రీస్తూకి సంబంధించిన ఆధారాలను సేకరించి చిత్రాన్ని తెరకెక్కించాను. చాలా ఏళ్ల తర్వాత ఎస్.పి.బాలుగారు క్రీస్తు సినిమాకి ఓ పాట పాడారు. చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందని ఆయన చెప్పడం ఆనందం కలిగించింది. ఆగస్ట్ 28న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పాటల్ని విడుదల చేసి, క్రిస్మ్సకి సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం'' అని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







