ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!

- September 20, 2025 , by Maagulf
ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!

మనామా: ముహర్రక్ మున్సిపల్ కౌన్సిల్ భవన నిర్మాణాలను నియంత్రించే చట్టానికి (డిక్రీ-లా నం. 13 ఆఫ్ 1977) ముసాయిదా సవరణను ఆమోదించింది.  ఇది నివాస ప్రాంతాలలో నిర్మాణం, కూల్చివేత మరియు తవ్వకం పనులను కొనసాగించడానికి వీలుగా వర్కింగ్ అవర్స్ ను మునిసిపాలిటీ నిర్ణయించడానికి అనుమతిస్తుంది.

షురా కౌన్సిల్ ప్రతిపాదించిన ఈ ముసాయిదా చట్టం ఇప్పుడు అమల్లోకి రానుంది. వర్కింగ్ అవర్స్  షెడ్యూల్‌ను నిర్ణయించడానికి, స్థానిక పరిస్థితుల ఆధారంగా మినహాయింపులను మంజూరు చేయడానికి మునిసిపాలిటీకి అధికారాన్ని కల్పించారు.

రాబోయే చట్టం లైసెన్సింగ్ విధానాలు, ప్రాజెక్ట్ అవసరాలు మరియు నిర్మాణ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను కవర్ చేస్తుంది. స్థానికులకు సౌండ్, అంతరాయం లాంటి ఇబ్బందులు కలిగించకుండా నిర్మాణ పనులైన తవ్వకం, బ్యాక్‌ఫిల్లింగ్ ను నిర్ధిష్ట సమయాల్లోనే కొనసాగించనున్నారు.

కొత్త చట్టం అమలుతో మునిసిపాలిటీలు నివాస ప్రాంతాలలో భవన నిర్మాణ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయకుండా మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com