వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- September 20, 2025
యూఏఈ: కుమారుడికి టీకా వేసే ప్రక్రియలో జరిగిన వైద్య తప్పిదానికి తండ్రికి 3 లక్షల 50వేల దిర్హమ్స్ పరిహారంగా ఇవ్వాలని అబుదాబిలోని ఒక కోర్టు తీర్పు వెలువరించింది. వ్యాక్సినేషన్ సమయంలో వైద్యుడు తప్పు చేశాడని ఆరోపిస్తూ అల్ అయిన్ నగరంలోని ఒక తండ్రి ఒక ఆసుపత్రి, అక్కడి డాక్టర్ పై ఫిర్యాదు చేశాడు. డాక్టర్ పొరబాటు శాశ్వత వైకల్యానికి దారితీయకపోయినా, వైద్యుడు సరైన స్థలంలో వ్యాక్సిన్ వేయలేదని, సరైన ప్రొసిజర్స్ ఫాలో కాలేదని తండ్రి ఆరోపించాడు.
కాగా, ఈ కేసు పై నియమించిన కమిటీ డాక్టర్ లోపాన్ని నిర్ధారించింది. కేసును విచారించిన కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ తండ్రికి అనుకూలంగా తీర్పునిచ్చింది. తండ్రికి 3 లక్షల దిర్హమ్స్ ను పరిహారంగా చెల్లించాలని ఆసుపత్రి, డాక్టర్ ను ఆదేశించింది. అయితే, ఈ తీర్పుకు వ్యతిరేకంగా డాక్టర్, ఆస్పత్రి అప్పీల్ చేసిన తర్వాత, అప్పీల్ కోర్టు తీర్పును సవరించింది. సుప్రీం వైద్య బాధ్యత కమిటీ నివేదికను సమీక్షించిన తర్వాత పరిహారాన్ని 3 లక్షల 50 వేల దిర్హమ్స్ కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు