షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- September 22, 2025
ఆసియాకప్ 2025లో భాగంగా గ్రూప్ స్టేజీలో సెప్టెంబర్ 14న భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కరచాలన వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ టాస్ సమయంలో, మ్యాచ్ ముగిసిన తరువాత టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు మిగిలిన భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. ఆఖరికి అధికారులతో కూడా టీమ్ఇండియా ప్లేయర్లు కరచాలనం చేయలేదు.
ఇక నిన్న (ఆదివారం సెప్టెంబర్ 21న) సూపర్-4లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాక్ జట్లు (IND vs PAK) మరోసారి తలపడ్డాయి. ఈ సారి కూడా టాస్ సమయంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేయలేదు. అయితే.. మ్యాచ్ ముగిసిన తరువాత టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభ్యర్థన మేరకు ప్రోటోకాల్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలును బట్టి.. మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండగా.. మైదానంలో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ప్లేయర్లను బయటకు వచ్చి అంపైర్లతో కరచాలనం చేయమని కోరాడు. ఇక్కడ షరతు ఏంటంటే.. పాక్ ఆటగాళ్లతో కాకుండా అంపైర్లతో మాత్రమే కరచాలనం చేయాలని సూచించాడు.
పాక్ ఇజ్జత్ తీసిన సూర్యకుమార్ యాదవ్?
మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఇన్‌డైరెక్టుగా పాక్ ఇజ్జత్ తీశాడు. ఇక నుంచి ఆ జట్టును ప్రత్యర్థి అని పిలవడం మానేయాలని కోరాడు. ఓ రెండు జట్ల మధ్య 20 మ్యాచ్ జరిగాయని అనుకుంటే.. అప్పుడు గణాంకాలు 10-10 లేదా 11-9 లేదా 12-8 ఉంటే వాటిని ప్రత్యర్థులు (సమఉజ్జీలు)అని అనొచ్చు. అంతేకానీ.. 13-0, 10-1 గణాంకాలు నమోదు అయితే వాటిని ప్రత్యర్థులు అని పిలవొద్దు అంటూ ఇన్‌డైరెక్టుగా పాక్ ఇజ్జత్ తీశాడు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం