యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- September 22, 2025
యూఏఈ: యూఏఈలోని స్కూల్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను అనుమతించకూడదని నిర్ణయించాయి. మంచి పోషకాహారాన్ని పిల్లలకు అందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్కూల్స్ తెలిపాయి. అలాగే, పిల్లలలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఈ చర్యలు భాగమన్నారు.
వుడ్లెమ్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ నౌఫాల్ అహ్మద్ తన స్కూల్ పాలసీని వివరించారు. తమ క్యాంటీన్ ప్రమాణాలకు అనుగుణంగా పోషకాలతో కూడిన అధిక-నాణ్యత గల భోజనాన్ని అందిస్తాయన్నారు. అందుకే, విద్యార్థులకు ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్‌ను ఇకపై అనుమతించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇక స్కూల్లో ఏ ఒక్క స్టూడెంట్ ఆకలితో ఉండకూడదని , ఒక మానవీయ కోణంలో తమ క్యాంటీన్ నుండి ఆరోగ్యకరమైన భోజనం అందేలా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదే సమయంలో తల్లిదండ్రులు రిసెప్షన్ వద్ద లంచ్ బాక్స్‌లను అందజేసే అవకాశాన్ని కూడా కల్పించినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా, GEMS ఎడ్యుకేషన్ సొసైటీ ఇటీవల తల్లిదండ్రులకు ఆహార పంపిణీకి సంబంధించిన విధానాలను వివరిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆహార భద్రత అత్యంత ప్రాధాన్యత అని, ఫుడ్ హెల్త్ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని సర్క్యులర్ లో పేర్కొన్నారు. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలను అనుమతించమని, పేరెంట్స్ సహకరించాలని కోరారు.
మరోవైపు, అబుదాబి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. పాఠశాలలు ఆరోగ్యకరమైన ఆహార విధానాలను కఠినతరం చేయాలని, పాఠశాల సమయాల్లో ఆహార డెలివరీ సేవలపై నిషేధం కూడా విధించాలని కోరింది. దాంతో కొన్ని పాఠశాలలు 'నో చైల్డ్ లెఫ్ట్ ఎంప్టీ' ప్రోటోకాల్‌ను అమలు చేస్తున్నాయి.
అబుదాబిలోని దియాఫా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ డేవిడ్ ఫ్లింట్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ID బ్యాడ్జ్ కు లింక్ చేసిన కొత్త నగదు రహిత కొనుగోలు వ్యవస్థ ద్వారా పిల్లలు స్కూల్ కేఫ్ నుండి ఆరోగ్యకరమైన భోజనాన్ని కొనుగోలు చేయవచ్చన్నారు. తల్లిదండ్రులు తరచుగా భోజన సమయానికి ముందు కార్డును రిమోట్‌గా టాప్ అప్ చేసే అవకాశాన్ని కల్పించారు. తమ స్కూల్ కెఫ్ లో చక్కెర పానీయాలు మరియు 'జంక్' వస్తువులకు మెనులో స్థానం లేదన్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం