అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- September 23, 2025
కువైట్: కువైట్ లో అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్ ప్రారంభం అయ్యాయి. మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి అయిన షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా ఆదేశాలకు అనుగుణంగా వీటిని ప్రారంభించారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ మెస్ఫర్ అల్-అద్వానీ మరియు మానవ వనరులు, సమాచార సాంకేతిక విభాగ అధిపతి బ్రిగేడియర్ జనరల్ అన్వర్ అహ్మద్ అల్-యతమా పర్యవేక్షణలో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్ పనిచేయనున్నాయి.
భద్రతా విధానాల వేగంతోపాటు ఖచ్చితత్వాన్ని పెంచడం, పర్యవేక్షణ వ్యవస్థలను మెరుగుపరచడం, క్షేత్ర కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచడం వీటి ప్రధాన లక్ష్యమన్నారు. నిఘా మరియు భద్రతా కార్యకలాపాలలో ఏఐ సహా అత్యాధునిక సాంకేతికతలతో ప్రత్యేక జాతీయ కేడర్ల ద్వారా పెట్రోల్స్ రూపొందించినట్లు తెలిపారు. ఇందులో ఫేస్ రికగ్నిషన్ గుర్తింపుతోపాటు వాహన లైసెన్స్ ప్లేట్ వ్యవస్థలను ఇందులో అమర్చిన కెమెరాలు రీడ్ చేస్తాయని వివరించారు. తక్షణ ఇమేజ్ ప్రాసెసింగ్ , వ్యక్తులను వెంటనే గుర్తించడానికి పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ గుర్తింపు పరికరం, వాంటెడ్ వ్యక్తులు మరియు వాహనాలను గుర్తించేందుకు వీలుగా MOI డేటాబేస్లతో యాక్సెస్ ఈ వాహనాల్లో ఉంటుందని, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ మానిటరింగ్ సాధనాలు వీటిని ప్రత్యేకంగా నిలుపుతాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..