CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..

- September 24, 2025 , by Maagulf
CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..

న్యూ ఢిల్లీ: CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ కు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. టెన్త్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తాయి. ఈసారి 10, 12 తరగతుల పరీక్షలకు దాదాపు 45 లక్షల మంది హాజరవుతారని బోర్డ్ తెలిపింది. మొత్తం సబ్జెక్టులు 204. పూర్తి వివరాలకు http://www.cbse.gov.inసైట్ చూడాలంది. అన్ని పేపర్స్ పరీక్షలు ఒకే షిఫ్ట్ లో (ఉదయం 10.30 గంటలకు) నిర్వహిస్తారు.

షెడ్యూల్ ప్రకారం, CBSE సెకండరీ స్కూల్ పరీక్షలు 2026 (10వ తరగతి) మంగళవారం, ఫిబ్రవరి 17, 2026న ప్రారంభమై మార్చి 18, 2026 వరకు కొనసాగుతాయి. అదే విధంగా, CBSE సీనియర్ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షలు 2026 (తరగతి 12) ఫిబ్రవరి 17, 2026న ప్రారంభమై ఏప్రిల్ 4, 2026న ముగుస్తాయి.

10, 12వ తరగతి పరీక్షలు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించబడతాయని బోర్డు తెలిపింది. ఉదయం 10:30 గంటలకు ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. అయితే, CBSE బోర్డు పరీక్షల 2026కి ఇది తాత్కాలిక షెడ్యూల్ అని, అవసరమైతే సవరణ కూడా ఉండొచ్చనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలని బోర్డు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com