మహ్దా హనీ అండ్ డేట్స్ ఫోరం ప్రారంభం..!!
- September 25, 2025
మస్కట్: ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) అల్ బురైమి శాఖ ఆధ్వర్యంలో మహ్దా హనీ అండ్ డేట్స్ ఫోరం మూడో ఎడిషన్ ప్రారంభమైంది. ఇందులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకు చెందిన దాదాపు 100మంది ఉత్పత్తిదారులు పాల్గొంటున్నారు. ఈ నెల 28 వరకు ఈ ఫోరం కొనసాగుతుంది. ఈ ఫోరాన్ని ఆర్థిక మంత్రి డాక్టర్ సైద్ బిన్ మొహమ్మద్ అల్ ప్రారంభించారు.
అల్ బురైమి గవర్నరేట్ లో లభించే సహజ హనీ అండ్ డేట్స్ ను ప్రోత్సహించేందుకు ఈ పోరాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే, స్థానిక ఉత్పత్తిదారులు మరియు దిగుమతిదారుల మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యమని ఛాంబర్ అల్ బురైమి శాఖ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ జహెర్ బిన్ మొహమ్మద్ అల్ కాబి తెలిపారు. ఒమన్ సుల్తానేట్‌లో హనీ అండ్ డేట్స్ ఉత్పత్తిపై ఫోరమ్ దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు.
ఈ ఫోరమ్ సందర్భంగా ఖలాలు, ఫర్ధ్, నిఘాల్, బో మాన్ మరియు అరుదైన పామ్ అనే ఐదు రకాల్లో నిర్వహించిన వేలంలో 30 మందికి పైగా పాల్గొన్నారు. ఫోరమ్ మూడవ ఎడిషన్‌లో హనీ అండ్ డేట్స్ కు సంబంధించి పూర్తి సమాచారంతోపాటు మ్యూజియం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: ఫైనల్ చేరిన భారత్
- సౌదీ అరేబియాలో కియా స్పోర్టేజ్ వాహనాలు రీకాల్..!!
- బహ్రెయిన్ ఢిఫెన్స్ సిబ్బందిని ప్రశంసించిన కింగ్ హమద్..!!
- కువైటీ చైల్డ్ మర్డర్ కేసు.. డొమెస్టిక్ వర్కర్ కు మరణశిక్ష..!!
- దుబాయ్ లో 15 కి.మీ. సెల్ఫ్-డ్రైవింగ్ జోన్ ఆవిష్కరణ..!!
- మహ్దా హనీ అండ్ డేట్స్ ఫోరం ప్రారంభం..!!
- ఖతార్ లో కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ..!!
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!