సౌదీ అరేబియాలో కియా స్పోర్టేజ్ వాహనాలు రీకాల్..!!

- September 25, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో కియా స్పోర్టేజ్ వాహనాలు రీకాల్..!!

రియాద్: సౌదీ అరేబియాలో కియా స్పోర్టేజ్ వాహనాలను రీకాల్ చేశారు. ఫ్యుయల్ లీకేజీలకు కారణమయ్యే మరియు ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాద తీవ్రతను పెంచే సమస్యలను గుర్తించినట్లు, ఈ నేపథ్యంలో 1,791 2024 కియా స్పోర్టేజ్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఉచిత మరమ్మతులను పొందేందుకు వాహన యజమానులు అల్జాబర్ హోల్డింగ్ కంపెనీని టోల్-ఫ్రీ నంబర్ 8004400100 లేదా నేషనల్ మార్కెటింగ్ కంపెనీ (NMC) నంబర్ 8001010010ని సంప్రదించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే, రీకాల్ సెంటర్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా తమ వాహనాలు రీకాల్ జాబితాలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని తెలియజేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com