జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- September 26, 2025
రియాద్: సౌదీ అరేబియాలో నాన్ ఆయిల్ ఎగుమతులు పెరిగాయి. జూలై నెలకు సంబంధించి 30.4 శాతం పెరుగుదల నమోదైనట్టు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) విడుదల చేసిన అంతర్జాతీయ వాణిజ్య బులెటిన్ లో పేర్కొన్నారు. నాన్ ఆయిల్ ఎగుమతులకు దిగుమతుల నిష్పత్తి జూలైలో 44.6 శాతానికి పెరిగింది. మొత్తం నాన్ ఆయిల్ ఎగుమతుల్లో యంత్రాలు, విద్యుత్ పరికరాలు, విడిభాగాలు 29.7 శాతం ఉన్నాయి. ఆ తరువాత రసాయన ఉత్పత్తులు 19.6 శాతంగా ఉన్నాయి.
ఇక దిగుమతుల విషయానికొస్తే యంత్రాలు, విద్యుత్ పరికరాలు మరియు విడిభాగాలు మొత్తం దిగుమతుల్లో 11.7 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇది గతేడాది జూలై నెలతో పోలిస్తే 29.9 శాతం పెరిగింది. దీని తరువాత రవాణా పరికరాలు, విడిభాగాలు మొత్తం దిగుమతుల్లో 13.2 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొత్తం ఎగుమతుల్లో చమురు ఎగుమతుల శాతం 2024 జూలై లో 72.8 శాతం ఉండగా, అవి ఈ ఏడాది జులైలో 67.1 శాతానికి తగ్గింది.
సౌదీ అరేబియాకు చైనా ప్రముఖ వాణిజ్య భాగస్వామి అని బులెటిన్ వెల్లడించింది. జూలైలో చైనాకు ఎగుమతులు మొత్తం ఎగుమతుల్లో 14 శాతం ఉండగా, చైనా నుండి దిగుమతులు మొత్తం దిగుమతుల్లో 25.8 శాతం ఉన్నాయి. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం ఎగుమతుల్లో 10.6 శాతం , మొత్తం దిగుమతుల్లో 6.4 శాతంతో ఉంది. ఇక ఇండియా మొత్తం ఎగుమతుల్లో 9.4 శాతాన్ని కలిగి ఉంది.
తాజా వార్తలు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..