కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!

- September 26, 2025 , by Maagulf
కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!

కువైట్: కువైట్ లోని రింగ్ రోడ్లు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలలో నిర్వహించిన విస్తృత ట్రాఫిక్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 5,834 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశారు. అలాగే రెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 153 మంది వ్యక్తులను అరెస్టు చేయడంతోపాటు 47 వాహనాలను సీజ్ చేసినట్లు కువైట్ హోం మినిస్ట్రీ ప్రకటించింది.

జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ (హైవే డిపార్ట్‌మెంట్) ఈ క్యాంపెయిన్ నిర్వహించింది. వాహనదారులకు ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కల్పించడంతోపాటు చట్టాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమని హోం మినిస్ట్రీ తెలిపింది.   

 రహదారి భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్ ప్రణాళికలను అమలు ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అత్యవసర హాట్‌లైన్ 112 ద్వారా ఉల్లంఘనలు మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలను నివేదించాలని ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com