జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- September 26, 2025
అమెరికా: దక్షిణ అమెరికా దేశాల్లో పెరుగుతున్న హింస, గ్యాంగ్‌వార్, అల్లర్ల వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈక్వెడార్‌లో గత కొన్నేళ్లుగా జైళ్లలో హింస తీవ్రతరం అవుతోంది. అత్యంత ప్రమాదకరమైన నేరగాళ్లు జైళ్లలో ఉండటం వల్ల, జైళ్లు తరచుగా హింసకు కేంద్రాలుగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం అల్లర్లు జరిగిన ఈక్వెడార్ జైలులో, గురువారం నాడు మరోసారి భీకరమైన గ్యాంగ్‌వార్ జరిగింది.
గురువారం నాడు ఈక్వెడార్‌లోని ఎస్మెరాల్డాస్ ప్రావిన్స్ రాజధానిలోని జైలులో ఈ గ్యాంగ్‌వార్ చోటుచేసుకుంది. పాత పగలు, శత్రుత్వం కారణంగా రెండు ముఠాలకు చెందిన దుండగుల మధ్య మొదలైన ఘర్షణ కొద్దిసేపటికే కాల్పుల మోతకు దారి తీసింది. రెండు గ్యాంగ్‌ల దుండగులు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా కాల్పులు(firing) జరుపుకున్నారు. ఈ భీకర గ్యాంగ్‌వార్‌లో రెండు శత్రు ముఠాలకు చెందిన 17 మంది దుండగులు మరణించారు. పలువురు ఖైదీలు గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
దుండగులు పొంచి ఉండి మరో ముఠాపై దాడి చేసి, సెల్ తాళాలను దొంగిలించినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత బయటి సెల్లో ఉన్న ఖైదీలను లక్ష్యంగా చేసుకుని ఈ హింసాకాండకు పాల్పడ్డారు. ఈ ఘటనతో జైలు అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఈక్వెడార్ జైళ్లలో భద్రతా లోపాలు, గ్యాంగ్‌ల ఆధిపత్య పోరు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
తాజా వార్తలు
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం