ఎయిర్‌పోర్ట్‌లో బాంబ్ హెచ్చరిక..అప్రమత్తమైన సిబ్బంది

- September 28, 2025 , by Maagulf
ఎయిర్‌పోర్ట్‌లో బాంబ్ హెచ్చరిక..అప్రమత్తమైన సిబ్బంది

ఈ మధ్య కాలంలో ఫేక్ కాల్స్ మరియు బెదిరింపు మెయిల్స్ ఘటనలు పెరిగాయి. రైల్వేస్టేషన్లు, స్కూల్స్, షాపింగ్ మాల్స్‌కి బాంబు ఉంది అని కాల్‌లు చేసి భయభ్రాంతి కలిగించడం సాధారణమైందని చెప్పవచ్చు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆదివారం బాంబు ఉన్నట్టు ఫేక్ మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరించగా, అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది వెంటనే విమానాశ్రయంలో కఠిన తనిఖీలను నిర్వహించారు. తర్వాత అధికారులు ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసారు. ఈ సంఘటన నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఆందోళనలో పడకూడదని సూచించారు. అలాగే ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై తక్షణ సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

ఇలాంటి ఫేక్ బెదిరింపులు దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్ట్‌లలో, స్కూల్‌లలో, ఇతర ప్రజాసమూహ ప్రదేశాల్లో జరుగుతున్నాయి. ఢిల్లీ వంటి నగరాల్లో పాఠశాలలకు కూడా దుండగులు బెదిరింపు కాల్స్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఫేక్ కాల్స్ ఎవరు చేస్తున్నారు, ఎటువంటి ఉద్దేశ్యంతో చేస్తున్నారన్న అంశంపై అధికారులు నిర్వహిస్తున్నారు. నిరంతరం ఈ రకమైన ఘటనలు జరుగుతున్నందున, పెద్ద సమూహాలు ఉంటే అక్కడ సిబ్బంది సురక్షితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com