కబాలికి హిట్ టాక్..అమెరికాలో.
- July 20, 2016
సినీజనమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కబాలి సినిమా విడుదలైంది. అదేంటి రిలీజ్ రేపు కదా అని కంగారుపడకండి. ఇండియాలో రేపే విడుదల అవుతున్నప్పటికీ, అమెరికాలో ఒకరోజు ముందే విడుదలైంది. అమెరికాలో ప్రదర్శించిన స్పెషల్ షోను సూపర్‌స్టార్ రజనీకాంత్ వీక్షించారు. కబాలి సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంపై రజనీ సంతృప్తి వ్యక్తం చేశారు. రజనీ కుటుంబసభ్యులతో కలిసి కబాలిని వీక్షించారు. సినిమా చూసిన కొందరు ఎన్నారైలు ట్విట్టర్ వేదికగా తమ స్పందనను పంచుకున్నారు. కబాలి మూవీ పైసా వసూల్ సినిమా అని, తలైవా ఫ్యాన్స్ గర్వపడే సినిమా అని ట్వీట్ చేశారు. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించిన హీరో ఇంట్రడక్షన్ సీన్‌ను వీడియో తీసి వాట్సాప్‌లో పెట్టారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ సీన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్‌లో కబాలి రికార్డ్ సృష్టించింది. రేపు తెలుగు, తమిళ భాషల్లో కబాలి విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుండటం విశేషం.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







