యుఎఇ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడాది బాలుడి మృతి 23 మందికి గాయాలు
- July 20, 2016
మస్క్యాట్: యుఎఇ లో బుధవారం ఉదయం జరిగిన ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదంలో ఏడాది వయస్సు ఉన్న ఒక బాలుడి మృతి చెందగా మరో 23 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇరాన్ నుంచి పర్యటన ముగించుకున్న మొత్తం 24 మంది ప్రయాణికుల షార్జ విమానాశ్రయం నుంచి బస్సులో ఒమాన్ కు తిరిగి ప్రయాణించే సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
కల్బా యొక్క వాడి అల్ హలో యొక్క మాడీక్ స్ట్రీట్ లో ఉదయం 6.50 సమయంలో బస్సు ఒక ఆకస్మిక మలుపు వద్ద తిరుగుతూ ప్రమాదానికి గురయ్యాయంది. అగ్ని రాజుకొని బస్సుని చుట్టుముట్టింది.
అబూధాబీలో ఉన్న ఒమన్ ఎంబసీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో కల్బా హాస్పిటల్ లో ఉన్న ముగ్గురు ఓమానీయుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇద్దరు పిల్లలకు కాళ్లు చేతులు విరిగిపోయాయి. అలాగే ఒక మహిళ 35 శాతం పై కాలిన శరీర గాయాలతో బాధపడుతుంది. ఒమాని ఎంబసీ వద్ద ఒక అధికారిక ప్రతినిధి ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన ఏడాది పిల్లవాడి మృతదేహాన్నిసోమవారం స్వదేశానికి పంపించబడుతున్నట్లు" మా గల్ఫ్ డాట్ కామ్ " కు ఆయన తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో మరణించినబాలుడు బస్సు డ్రైవర్ యొక్క కుమారుడని తెలిపారు. దక్షిణ బతినః గవర్నరేట్ లో ప్రయాణికులు ఇరాన్ లో సెలవలు ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ ప్రమాదంలో ఎక్కువ మంది పిల్లలు మరియు మహిళలు ఉన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







