కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!

- September 29, 2025 , by Maagulf
కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!

కువైట్: కువైట్ మునిసిపాలిటీ ప్రత్యేక తనిఖీలను నిర్వహించింది. ప్రజా భద్రతకు విఘాతం కలిగించే వాహనాలను గుర్తించి తొలగించారు. ఉల్లంఘనల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు కొనసాగుతాయిన అధికారులు తెలిపారు. మున్సిపల్ చట్టాలను కఠినంగా అమలు చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 

పబ్లిక్ రోడ్లపై ట్రాఫిక్ కు ఇబ్బందులను కలిగించే వారిపై కఠినంగా వ్యవహారిస్తామని హెచ్చరించారు.  ఈ సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించిన 21 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 84 మందికి నోటీసులు జారీ చేశారు.  ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, పరిశుభ్రత ప్రమాణాలను నిర్వహించడానికి కువైట్ లోని అన్ని గవర్నరేట్లలో తనిఖీలు కొనసాగుతాయని మునిసిపల్ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com