సమ్మర్ వర్క్ బ్యాన్‌ని ఉల్లంఘించిన బహ్రెయిన్ కంపెనీలు
- July 21, 2016
బహ్రెయిన్ హ్యూమన్ రైట్స వాచ్ సొసైటీ (బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్), బహ్రెయిన్‌లో చాలా కంపెనీలు వర్క్ బ్యాన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్లు వెల్లడించాయి. లేబర్ అండ్ సోషల్ మినిస్ట్రీ, సమ్మర్ వర్క్ బ్యాన్‌ని విధించింది జులై 1 నుంచి ఆగస్ట్ 31 వరకు అమల్లో ఉండే ఈ బ్యాన్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు కార్మికులు ఎండలో పనిచేయరాదు. 'హీట్ కిల్స్ దెమ్' పేరుతో నిబంధనల్ని ఉల్లంఘించినవారిని గుర్తించేందుకు బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్ ఓ క్యాంపెయిన్ని ప్రారంభించింది. సామాన్యులెవరైనా సరే, తమ మొబైల్ కెమెరాలు లేదా మామూలు కెమెరాలతో బ్యాన్ సమయంలో పనిచేస్తున్నవారి ఫొటోల్ని పంపించవచ్చని నిర్వాహకులు తెలిపారు. అలా వచ్చిన ఫొటోలు, ఫిర్యాదుల్ని మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళతారు. ఇంకో వైపున లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ జమీల్ హుమైదాన్, పలు నిర్మాణ రంగ సంస్థల సైట్స్‌లో ఇన్స్పెక్షన్ నిర్వహించారు. హుమైదాన్ వెంట పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. జులై 1 నుంచి 3,831 ఇన్స్పెక్షన్స్ జరిగాయనీ, 38 నిబంధనల ఉల్లంఘనలు ఈ సందర్భంగా గుర్తించామనీ, తద్వారా 67 మంది వర్కర్స్‌తో నిబంధనలకు విరుద్ధంగా పనిచేయిస్తున్నారని అధికారులు తెలిపారు. నిబంధనల్ని ఉల్లంఘించినవారు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







