సమ్మర్‌ వర్క్‌ బ్యాన్‌ని ఉల్లంఘించిన బహ్రెయిన్‌ కంపెనీలు

- July 21, 2016 , by Maagulf
సమ్మర్‌ వర్క్‌ బ్యాన్‌ని ఉల్లంఘించిన బహ్రెయిన్‌ కంపెనీలు

బహ్రెయిన్‌ హ్యూమన్‌ రైట్‌స వాచ్‌ సొసైటీ (బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్‌), బహ్రెయిన్‌లో చాలా కంపెనీలు వర్క్‌ బ్యాన్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్లు వెల్లడించాయి. లేబర్‌ అండ్‌ సోషల్‌ మినిస్ట్రీ, సమ్మర్‌ వర్క్‌ బ్యాన్‌ని విధించింది జులై 1 నుంచి ఆగస్ట్‌ 31 వరకు అమల్లో ఉండే ఈ బ్యాన్‌ ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు కార్మికులు ఎండలో పనిచేయరాదు. 'హీట్‌ కిల్స్‌ దెమ్‌' పేరుతో నిబంధనల్ని ఉల్లంఘించినవారిని గుర్తించేందుకు బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్‌ ఓ క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. సామాన్యులెవరైనా సరే, తమ మొబైల్‌ కెమెరాలు లేదా మామూలు కెమెరాలతో బ్యాన్‌ సమయంలో పనిచేస్తున్నవారి ఫొటోల్ని పంపించవచ్చని నిర్వాహకులు తెలిపారు. అలా వచ్చిన ఫొటోలు, ఫిర్యాదుల్ని మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళతారు. ఇంకో వైపున లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ మినిస్టర్‌ జమీల్‌ హుమైదాన్‌, పలు నిర్మాణ రంగ సంస్థల సైట్స్‌లో ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించారు. హుమైదాన్‌ వెంట పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. జులై 1 నుంచి 3,831 ఇన్‌స్పెక్షన్స్‌ జరిగాయనీ, 38 నిబంధనల ఉల్లంఘనలు ఈ సందర్భంగా గుర్తించామనీ, తద్వారా 67 మంది వర్కర్స్‌తో నిబంధనలకు విరుద్ధంగా పనిచేయిస్తున్నారని అధికారులు తెలిపారు. నిబంధనల్ని ఉల్లంఘించినవారు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com