రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- October 01, 2025
న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ 100 రూపాయల నాణెన్ని విడుదల చేశారు. దాంతో పాటు పోస్టల్ స్టాంప్ ను ఆయన రిలీజ్ చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శత జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఈ ప్రత్యేకమైన నాణెన్ని, పోస్టల్ స్టాంప్ ను రిలీజ్ చేశారు. కాగా, ఈ నాణెం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ కాయిన్ పై ఒకవైపు జాతీయ చిహ్నం ఉంది. మరోవైపు భరతమాత బొమ్మ ఉంది. ఇక దీనిపై ఆర్ఎస్ఎస్ నినాదం కూడా ముద్రించడం విశేషం. కాగా స్వతంత్ర భారత దేశ చరిత్రలో కరెన్సీపై భరతమాతను ముద్రించడం ఇదే తొలిసారి అని ప్రధాని మోదీ తెలిపారు.
బుధవారం ఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక రూ.100 నాణెం, స్మారక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. ఈ నాణెంపై “వరద ముద్ర”లో సింహంపై కూర్చున్న భరతమాత చిత్రం ఉంది. జాతీయ సేవలో ఆర్ఎస్ఎస్ సంస్థ చరిత్రాత్మక పాత్రను సూచిస్తూ 1963 గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొన్న RSS స్వయంసేవకులను పోస్టల్ స్టాంపులో చిత్రీకరించారు.
డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ ఐక్యత, సామాజిక సామరస్యానికి ఎదురవుతున్న ముప్పుల గురించి ఆయన హెచ్చరించారు. ”భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ ఆత్మ. ఈ బలం విచ్ఛిన్నమైతే, దేశం బలహీనపడుతుంది. సామాజిక సామరస్యానికి చొరబాటుదారుల నుండి పెద్ద ముప్పు ఎదురవుతుంది. దీని వల్ల జనాభా మార్పు వస్తుంది. ఈ ప్రశ్న మన అంతర్గత భద్రత, భవిష్యత్తుకు సంబంధించినది. అందుకే నేను ఎర్రకోట నుండి డెమోగ్రాఫిక్ మిషన్‌ను ప్రకటించాను. మనం అప్రమత్తంగా ఉండి ఈ సవాల్ తో పోరాడాలి” అని ప్రధాని మోదీ అన్నారు.
”RSS స్థాపనను విజయదశమి పండుగకు ప్రతీకగా చెప్పారు ప్రధాని మోదీ. “రేపు విజయదశమి. చెడుపై మంచి విజయం. అన్యాయంపై న్యాయం విజయం. అబద్ధాలపై సత్యం విజయం. చీకటిపై వెలుగు విజయాన్ని సూచించే పండుగ. 100 సంవత్సరాల క్రితం ఈ గొప్ప రోజున RSS ఒక సంస్థగా స్థాపించబడటం యాధృచికం కాదు” అని ప్రధాని మోదీ అన్నారు.
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌కు ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఆయన జాతీయ సేవా దృక్పథాన్ని ప్రశంసించారు. “సంఘ్ శతాబ్ది సంవత్సరం వంటి గొప్ప సందర్భాన్ని చూసే అవకాశం మనకు లభించడం మన తరం స్వచ్ఛంద సేవకుల అదృష్టం” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జాతీయ సేవకు అంకితమైన లక్షలాది స్వచ్ఛంద సేవకులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారిని అభినందిస్తున్నాను. సంఘ్ వ్యవస్థాపకుడు, మనకు గౌరవనీయులు, ఆదర్శప్రాయులు, అత్యంత పూజ్యులైన డాక్టర్ హెడ్గేవార్ పాదాల వద్ద నా వినయపూర్వకమైన నివాళి అర్పిస్తున్నా. 1925లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది. సాంస్కృతిక అవగాహన, సేవ, క్రమశిక్షణ , సమాజం పట్ల బాధ్యతను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది. స్వచ్ఛంద సేవకులతో నడపబడే సంస్థ ఆర్ఎస్ఎస్.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!