ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- October 01, 2025
దోహా: ఖతార్ లో లైసెన్స్ లేని ఆయుధాలను కలిగి ఉన్న పౌరులందరూ విధిగా లైసెన్స్ పొందాలని సూచించింది. ఇందులో వారసత్వంగా, వీలునామా ద్వారా లేదా గడువు ముగిసిన ఆయుధాల లైసెన్స్‌లు ఉన్నవారు, క్రిమినల్ ఎవిడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లోని ఆయుధాలు ఉన్నవారు విధిగా ఆయుధాల లైసెన్సింగ్ కార్యాలయాన్ని సందర్శించి, అవసరమైన లైసెన్స్ పొందాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు కాలంలో నమోదు కాని ఆయుధాలకు లైసెన్స్ పొందడం లేదా గడువు ముగిసిన లైసెన్స్‌లను పునరుద్ధరించడం అత్యవసరమని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2026 జనవరి 1 నుండి లైసెన్స్ లేని ఆయుధాన్ని కలిగి ఉన్నట్లు తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లైసెన్స్ లేకుండా ఆయుధాన్ని కలిగి ఉంటే.. జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







