రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- October 01, 2025
రియాద్: లైసెన్స్ లేకుండా ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్న ఓ డాక్టర్ ను అధికారులు అరెస్టు చేశారు. అతను చట్టాలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ పేషంట్లను ఆకర్షిస్తున్నాడని అధా తెలిపారు. పక్కా సమాచారంతో నిబంధనలకు విరుద్ధంగా హెల్త్ ప్రాక్టిస్ చేస్తున్న అరబ్ జాతీయుడిని భద్రతా అధికారుల సహకారంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అరెస్టు చేశారు.
ఫిజియోథెరపీ, హెర్నియేటెడ్ డిస్క్ లకు చికిత్స వంటి వివిధ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి అరబ్ జాతీయుడు తన సొంత వాహనంలో రోగుల ఇళ్లకు వెళుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. తదుపరి చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటువంటి ఉల్లంఘనలకు జరిమానాలుగా ఆరు నెలల వరకు జైలు శిక్ష మరియు SR100,000 వరకు జరిమానా విధించబడుతుందని తెలిపింది.
లైసెన్స్ పొందిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో అర్హత కలిగిన నిపుణులచే ఆరోగ్య సంరక్షణ సేవలు పొందాలని సూచించారు. ఏదైనా ఉల్లంఘనలు లేదా అనధికార ఆరోగ్య సంరక్షణ పద్ధతులను వెంటనే 937 నంబర్ ద్వారా నివేదించాలని మంత్రిత్వశాఖ కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు
- కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..!!
- ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు ఊరట..!!
- దుబాయ్‌లో ఫేక్ పటెక్ ఫిలిప్ వాచ్ విక్రయం.. మహిళకు Dh10,000 ఫైన్..!!
- సౌదీ అరేబియాలో జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లకు తుది గడువు..!!
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!







