దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- October 01, 2025
దుబాయ్: దుబాయ్ లోని ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు జరిగాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగను దుబాయ్ లో ఉంటున్న తెలుగింటి ఆడబిడ్డలు బతుకమ్మ వేడుకలకు హాజరు అయ్యి 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో' అంటూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ డప్పు చప్పుల్ల మధ్య బతుకమ్మ ఆటలు ఆడి గౌరమ్మకు పూజలు జరిపి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 3000 మందికి పైగా తెలంగాణ ప్రవాసియులు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో కోలాటాల ఆటలతో వేడుక ప్రాంగణం పులకించిపోయింది.అందులో భాగంగా ఇండియన్ పీపుల్స్ ఫోరం స్థాపించినప్పటి నుండి వలసవచ్చిన కార్మికులకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ అన్నివిధాలుగా తోడుగా ఉంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. అందులో భాగంగా ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుంబాల మహేందర్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ మాట్లాడుతూ..."కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి రామచందర్ మరియు పార్లిమెంట్ సభ్యులు సానుకూలంగా స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బడ్జెట్ తీసుకరాడంలో పాటుపడుతం" అన్నారు.




ఈ కార్యక్రమానికి ఎన్.రాంచందర్ రావు (భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ) ముఖ్యఅతిథిగా విచ్చేయగా..గౌరవ అతిథులుగా డీకే అరుణ (ఎంపీ, మహబూబ్ నగర్), అర్వింద్ ధర్మపురి(ఎంపీ, నిజామాబాద్), రఘునందన్ రావు (ఎంపీ, మెదక్), సి.అంజి రెడ్డి (MLC), వాసుదేవ రావు (తెలంగాణ రాష్ట్ర కోశాధ్యక్షులు), ఎన్.వి సుభాష్ (BJP అధికార ప్రతినిధి మరియు మీడియా ఇంచార్జ్),జితేందర్ వైద్య (ఐపిఫ్-యూఏఈ అధ్యక్షులు), సురేష్ కొచ్చటిల్ (సీనియర్ జర్నలిస్ట్) మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


కుంబల మహేందర్ రెడ్డి (ఐపీఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు), వంశీ గౌడ్ రత్నగిరి(సీనియర్ ఐపిఫ్ నాయకులు), ఉపాధ్యక్షులు శరత్ గౌడ్, రమేష్ గౌడ్, జనరల్ సెక్రటరీ నవనీత్ గాజా, జాయింట్ సెక్రటరీ మదన్, యోగేష్,అపర్ణ, కృష్ణ మేగి, డా.సౌజన్య ముత్యాల, ట్రెసరర్ కృష్ణ నిమ్మల, మీడియా ఇన్చార్జి జగదీష్, అశోక్ పెనుకూల, సుకుమార్ మరియు ఎక్యూటివ్ సభ్యులు గోవర్ధన్ యాదవ్, అజయ్ దేశవేని, వేణు దుంపేట, పిట్ల రమేష్, వేణు, రాజు, విష్ణు తదితరులు సమక్షంలో ఈ ఏడాది బతుకమ్మ అందరిని అలరించింది.
తాజా వార్తలు
- హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మన్గా హిట్మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్గా భారత్







