'బ్యాడ్ బాయ్ కార్తీక్' నుంచి అమెరికా నుండి వచ్చాను సాంగ్ రిలీజ్
- October 02, 2025
హీరో నాగశౌర్య అప్ కమింగ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్. ఈ మూవీకి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య జోడిగా విధి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. నాగ శౌర్య క్యారెక్టర్ ఇంటెన్స్ నేచర్ ని ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఫస్ట్ సింగిల్ నా మావ పిల్లనిత్తానన్నాడే సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ అమెరికా నుండి వచ్చాను పాటని రిలీజ్ చేశారు.
హారిస్ జయరాజ్ ఈ సాంగ్ ని ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. చంద్రబోస్ రాసిన లిరిక్స్ మాస్ ని ఆకట్టుకోవడంతో పాటు చాలా డెప్త్ మీనింగ్ తో వున్నాయి.
చందన బాల కళ్యాణ్, గోల్డ్ దేవరాజ్ వోకల్స్ సాంగ్ లో మరింత ఎనర్జీ నింపాయి. ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రంలో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పని చేస్తున్నారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ కాగ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.
నటీనటులు: నాగ శౌర్య, విధి, సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్)
నిర్మాత: శ్రీనివాసరావు చింతలపూడి
బ్యానర్: శ్రీ వైష్ణవి ఫిల్మ్స్
డీవోపీ: రసూల్ ఎల్లోర్
సంగీతం: హారిస్ జైరాజ్
ఆర్ట్: రామాంజనేయులు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్- సుప్రీమ్ సుందర్, పృధ్వి
కొరియోగ్రాఫర్స్: రాజు సుందరం, శోబి మాస్టర్, విజయ్ పొలంకి, శిరీష్
లిరిక్స్: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: శంకర్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!