'జటాధర' నుంచి ధన పిశాచి సాంగ్ రిలీజ్

- October 02, 2025 , by Maagulf
\'జటాధర\' నుంచి ధన పిశాచి సాంగ్ రిలీజ్

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.

ఇటివల రిలీజ్ అయిన టీజర్ నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఫస్ట్ ట్రాక్ 'సోల్ ఆఫ్ జటాధార' కి అద్భుతమైన  రెస్పాన్స్ వచ్చింది
 
విజయదశమి కానుకగా ఈ సినిమా నుంచి ధన పిశాచి సాంగ్ రిలీజ్ చేశారు. సమీరా కొప్పికర్ పవర్ ఫుల్ ట్రాక్ కంపోజ్ చేశారు. శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ టెర్రిఫిక్ గా వున్నాయి.  సాహితీ చాగంటి ఇంటెన్స్ వోకల్స్ తో ఆకట్టుకున్నారు.

ఈ సాంగ్ లో సోనాక్షి సిన్హా పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఈ సాంగ్ ని ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

జటాధరలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్‌తో పాటు ప్రముఖ నటులు కనిపించనున్నారు. మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి– విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ఈ చిత్రం చూపించబోతోంది.

జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరించారు. డివ్యా విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, భావిని గోస్వామి సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. సినిమాకి పవర్ ఫుల్ సౌండ్‌స్కేప్‌ను జీ మ్యూజిక్ కో అందిస్తోంది.జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com