మన శంకరవరప్రసాద్ నుంచి నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్
- October 02, 2025
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు'లో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.
శశిరేఖగా ది మాగ్నిఫిసెంట్ నయనతారను పరిచయం చేస్తూ, మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పసుపు రంగు చీరలో మెరిసిపోతూ కనిపించిన ఆమె లుక్ అదిరిపోయింది. ముత్యాల హారం, సంప్రదాయ గాజులతో, చేతిలో నలుపు రంగు హ్యాండిల్‌తో ఉన్న గొడుగును పట్టుకొని, ఫెస్టివల్ వైబ్ కనిపించిన ఈ లుక్ శశిరేఖ పాత్రకు గొప్ప సొగసుని తీసుకొచ్చింది.
నయనతార పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సాధారణంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయన్, ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో మొదటి నుంచే చురుకుగా పాల్గొంటున్నారు. రేపు విజయదశమి శుభ సందర్భంగా ఒక ప్రత్యేక సర్ప్రైజ్ను అనౌన్స్ చేస్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు.
ఇంతకుముందు చిరంజీవి ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ, ఆయనను స్టైలిష్ అవాతర్ లో చూపించడం అందరినీ ఆకట్టుకుంది.
టాప్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.
వ్యవహరిస్తున్నారు.
‘మన శంకరవరప్రసాద్ గారు’ 2026 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం- అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రచయితలు - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
VFX సూపర్వైజర్ - నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
ఎడిషినల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ
PRO - వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!