హైదరాబాద్: మొదలైన ఉస్మానియా కొత్త ఆసుపత్రి పనులు
- October 03, 2025
హైదరాబాద్: హైదరాబాద్ కి ప్రత్యేక గుర్తింపును తెచ్చిన ఉస్మానియా ఆసుపత్రి, నిజాం కాలం నాటి చారిత్రాత్మక వైద్యశాలగా ప్రసిద్ధి పొందింది. దశాబ్దాలుగా పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తూ కోట్లాది మందికి జీవనాధారం.
అయిన ఈ ఆస్పత్రి ఇప్పుడు కొత్త రూపులోకి అడుగుపెట్టబోతోంది.పాత భవనం, శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో ఆధునిక సౌకర్యాలతో కొత్త భవన నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దసరా పండగ నాడు ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి పునాది రాయి పడింది.ఉస్మానియా ఆస్పత్రిని హైదరాబాద్ గోషామహల్ స్టేడియానికి తరలించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో దసరా పండగ నాడు ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి పునాది రాయి వేశారు. దసరా పర్వదినం సందర్భంగా అధికారికంగా బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఎంఈఐఎల్ డైరెక్టర్ కె.గోవర్ధన్ రెడ్డి గురువారం, దసరా పండగ నాడు శాస్త్రోక్తంగా పూజలు చేసి ఉస్మానియా ఆస్పత్రి బిల్డింగ్ నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. పూజ అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనుకున్న సమాయానికే ఉస్మానియా భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.
ప్రైవేటు ఆస్పత్రలకు ధీటుగా.. అన్ని నూతన అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తాము అన్నారు.గోషామహల్ స్టేడియంలో సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా ఆస్పత్రి భవనాలు నిర్మించనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరి 31న దీనికి శంకుస్థాపన చేశారు.
ప్రతి భవనాన్ని 12 అంతస్తులుగా నిర్మించబోతున్నారు. 2,000 పడకల సామర్థ్యం దీన్ని నిర్మిస్తున్నారు. ప్రతి భవనం బేస్మెంట్లో రెండు అంతస్తుల పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రెండు సంవత్సరాల్లో ఈ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పనులు శరవేగంగా సాగుతాయని అంటున్నారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







