టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..
- October 04, 2025
అక్టోబర్ 19 నుంచి భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. కాగా.. ఈ రెండు సిరీస్‌ల కోసం బీసీసీఐ జట్లను ప్రకటించింది. వన్డే సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించింది. అతడి స్థానంలో టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ఇక టీ20లకు సూర్యకుమార్ యాదవ్ సారథిగా కొనసాగుతున్నాడు.
2027లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. అప్పటికి ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు 40 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలో అప్పటి వరకు అతడు ఆడతాడో లేదో అతడి ఫిట్నెస్ ఎలా ఉంటుందో అన్న విషయాలపై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించి ఓ ఆటగాడిగా రోహిత్ శర్మను కొనసాగించాలని బీసీసీఐ బావించినట్లు సమాచారం.
శ్రేయస్ అయ్యర్‌కు వన్డేల్లో వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్..
తాజా వార్తలు
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు







