ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- October 04, 2025
మనామా: ఇజ్రాయెల్ భద్రతా అధికారులు నిర్బంధించిన బహ్రెయిన్, కువైట్ పౌరుల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్ అక్రమంగా అదుపులోకి తీసుకున్న వారిని విడిపించేందుకు కువైట్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. బందీలు సురక్షితంగా తమ దేశాలకు వచ్చేందుకు అవసరమైన అధికారిక డాక్యుమెంటేషన్ను పూర్తి చేస్తున్నట్లు తెలిపింది. చట్టపరమైన మరియు దౌత్య పరమైన ప్రోటోకాల్లను పూర్తిగా గౌరవిస్తూ, తమ పౌరులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా చూసుకోవడానికి బహ్రెయిన్, కువైట్ కట్టుబడి ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!







