ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- October 04, 2025
మస్కట్: 2025 ప్రథమార్థంలో ఒమన్‌లో సైబర్ నేరాలు 50 శాతం పెరిగాయని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. సాంకేతికత, ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థలు మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల విస్తృత వినియోగం దీనికి కారణం అని రాయల్ ఒమన్ పోలీస్‌లోని ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జమాల్ హబీబ్ అల్ ఖురైషి తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఏఐ వంటి మోడ్రన్ టెక్నాలజీలతో నిరంతరం అప్డేట్ అవుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, దీంతో సైబర్ నేరాలు రోజురోజుకి పేరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారుతున్నాయని, నకిలీ వాణిజ్య ప్రకటనలతో జరుగుతున్న నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతుందని అన్నారు. రుసుము చెల్లించి, బాధితుల ఫోన్‌కు టెక్స్ట్ మెసేజుల ద్వారా వచ్చే (OTP) నంబర్‌ను నమోదు చేసే ముందు వివరాలను సరిచూసుకోవాలని, బ్యాంకు లావాదేవీల సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా అవిశ్వసనీయ పార్టీలతో బ్యాంకింగ్ లేదా వ్యక్తిగత డేటాను పంచుకోకుండా ఉండాలన్నారు. ఆన్‌లైన్ కొనుగోళ్ల కోసం ప్రాథమిక బ్యాంక్ కార్డ్ ను ఉపయోగించవద్దని, బదులుగా నిర్దిష్ట మొత్తాలతో కూడిన కార్డులను ఉపయోగించాలని సూచించారు.
ఏదైనా మోసపూరిత ప్రయత్నానికి గురైతే, వారు బ్యాంకు ఖాతాను వెంటనే స్తంభింపజేయాలన్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకొని కంప్లైట్ చేయాలని లేదా జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ రీసెర్చ్ టోల్-ఫ్రీ నంబర్ 80077444కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని బ్రిగేడియర్ జమాల్ హబీబ్ అల్ ఖురైషి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..