ఆర్యన్ అక్టోబర్ 31న శ్రేష్ట్ మూవీస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రిలీజ్
- October 04, 2025
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో విష్ణు విశాల్, విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర & ఆర్యన్ రమేష్ లతో కలిసి నిర్మించిన 'ఆర్యన్' అనే గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో వస్తున్నారు.ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. మేకర్స్ ఇటీవల టీజర్ ను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది.
ఆర్యన్ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రేష్ట్ మూవీస్ ద్వారా విడుదల చేయనున్నారు. అనేక బ్లాక్ బస్టర్లను అందించిన ప్రొడక్షన్ , డిస్ట్రిబ్యూషన్ బ్యానర్ మద్దతుతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. శ్రేష్ట్ మూవీస్ గతంలో విక్రమ్, అమరన్, థగ్ లైఫ్ వంటి చిత్రాలను విడుదల చేశారు.
సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.
విష్ణు విశాల్ FIR చిత్రానికి దర్శకత్వం వహించిన మను ఆనంద్ ఈ చిత్రానికి సహ రచయితగా పనిచేశారు. హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, గిబ్రాన్ సంగీతం, శాన్ లోకేష్ ఎడిటర్.
ట్రైలర్, ఆడియో లాంచ్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు త్వరలో అనౌన్స్ చేస్తారు.
తారాగణం - విష్ణు విశాల్, సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి
నిర్మాణం - విష్ణు విశాల్ (విష్ణు విశాల్ స్టూడియోస్)
దర్శకత్వం - ప్రవీణ్ కె
నిర్మాతలు - శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్
తెలుగు రిలీజ్: శ్రేష్ట్ మూవీస్
DOP - హరీష్ కన్నన్.
సంగీతం - జిబ్రాన్.
ఎడిటర్ - శాన్ లోకేష్.
స్టంట్స్ - స్టంట్ సిల్వా, పిసి స్టంట్స్ ప్రభు.
ఎడిషల్ స్క్రీన్ ప్లే - మను ఆనంద్.
ప్రొడక్షన్ డిజైన్ - ఎస్.జయచంద్రన్.
కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్ - వినోద్ సుందర్
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







