మెరీనా ఫైర్‌: దుబాయ్‌ కమ్యూనిటీ గొప్ప మనసు

- July 21, 2016 , by Maagulf
మెరీనా ఫైర్‌: దుబాయ్‌ కమ్యూనిటీ గొప్ప మనసు

దుబాయ్‌ మెరీనా టాలెస్ట్‌ రెసిడెన్షియల్‌ బిల్డింగ్స్‌లో ఒకటైన సులాఫా టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో దుబాయ్‌ కమ్యూనిటీ షాక్‌కి గురైంది. అయితే ఈ సమయంలో బాధితుల్ని ఆదుకునేందుకు దుబాయ్‌ కమ్యూనిటీ అంతా ఏకమైంది. వెస్టిన్‌ దుబాయ్‌ ఈ సందర్భంగా బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చింది. తాత్కాలికంగా షెల్టర్‌ కోసం ఎవరైనా సరే తమ హోటల్‌లో ఆశ్రయం పొందవచ్చని అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ప్రకటించింది. ఈ ఆఫర్‌ పట్ల సానుకూలంగా స్పందించిన చాఫర్‌ క్యాబ్‌ సర్వీస్‌ కరీమ్‌, బాధితుల్ని తరలించేందుకు ఉచితంగా తాము సర్వీస్‌ చేస్తామని ప్రకటించింది. మోయో షావాష్‌ అనే దుబాయ్‌ రెసిడెంట్‌, ట్విట్టర్‌ ద్వారా సులాఫా టవర్‌ ఫ్రెండ్స్‌, తన అపార్ట్‌మెంట్‌కి రావొచ్చనీ, వారి కోసం నీళ్ళు, స్నాక్స్‌ సిద్ధం చేసినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కొన్నేళ్ళ క్రితం తాను కూడా ఇలాంటి సమస్యనే ఎందుర్కొన్నాననీ అందుకే ఆ కష్టం తనకు తెలుసని ఆయన ఈ సందర్భంగా వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com