ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- March 10, 2026
న్యూ ఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పీటర్ ఎల్బర్స్ వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బోర్డుకు పంపిన లేఖలో పేర్కొన్నారు. తన నోటీసు పీరియడ్‌ను కూడా రద్దు చేయాలని కోరినట్లు సమాచారం. కంపెనీ ప్రకటన ప్రకారం మార్చి 10 నుంచి ఈ రాజీనామా అమల్లోకి వచ్చింది.
కొత్త సీఈఓ నియామకం జరిగే వరకు ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. విమానయాన సంస్థలో సేవా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం, వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించడం ప్రధాన లక్ష్యమని ఇండిగో బోర్డు తెలిపింది.
ఇండిగో బోర్డు ప్రస్తుతం కొత్త సీఈఓ కోసం అన్వేషణ ప్రారంభించింది. త్వరలోనే సంస్థకు కొత్త నాయకత్వాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇండిగోను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







