రోషన్ ఛాంపియన్ డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్

- October 07, 2025 , by Maagulf
రోషన్ ఛాంపియన్ డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్

యంగ్ హీరో రోషన్  తన లేటెస్ట్ ఫిల్మ్ ఛాంపియన్ తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాను , జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఛాంపియన్ ఫస్ట్ లుక్, ఆసక్తికరమైన టీజర్ గ్లింప్స్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.  

ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతుండగా, పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. “చాంపియన్” డిసెంబర్ 25న, క్రిస్మస్ సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. పండుగ సీజన్, న్యూ ఇయర్ హాలిడేలలో వస్తున్న ఈ చిత్రానికి బాక్సాఫీస్‌ బిగ్ బూస్ట్ ఇవ్వనుంది.

రిలీజ్ పోస్టర్‌లో రోషన్ లాంగ్ డార్క్ ఓవర్‌కోట్, బెల్టెడ్ వెయిస్ట్‌తో క్లాసీ లుక్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి బయటకు అడుగుపెడుతూ హీరోయిక్ ఎంట్రీ ఇవ్వడం అదిరిపోయింది.  

ఈ సినిమాలో రోషన్ ఇప్పటివరకు చేయని విభిన్న పాత్రలో కనిపించబోతున్నాడు. పాత్రకు సరిపోయేలా ఆయన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అయ్యారు.  

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా ఆర్. మధీ, మిక్కీ జే మేయర్ మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షన్‌కి తోట తరణి వంటి పెద్ద టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.

షూటింగ్ పూర్తి కాగానే సినిమా టీమ్ మ్యాసీవ్ ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో మరింత ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

తారాగణం: రోషన్, అనశ్వర రాజన్

సాంకేతిక సిబ్బంది:
ప్రొడక్షన్ బ్యానర్స్: స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్
ప్రెజెంట్స్: జీ స్టూడియోస్
దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం
DOP: ఆర్ మదీ
సంగీతం: మిక్కీ జె మేయర్
ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి
PRO: వంశీ-శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com