బెలారస్ –ఒమన్ మధ్య పలు ఒప్పందాలు..!!
- October 07, 2025
మిన్స్క్: బెలారస్ లో పర్యటిస్తున్న ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ పలు ఒప్పందాలను కుదర్చుకున్నారు. మిన్సిక్ లోని ఇండిపెండెన్స్ ప్యాలెస్‌లో రెండు ఒప్పందాలు, నాలుగు అవగాహన ఒప్పందాలు (MoUలు), ఒక సహకార ఒప్పంద పత్రాలపై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఆధ్వర్యంలో సంతకాలు జరిగాయి. సాధారణ పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్నవారికి వీసాల పరస్పర మినహాయింపు, రెండు దేశాల మధ్య అంతర్జాతీయ రోడ్డు రవాణాపై సహకారానికి సంబంధిన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
న్యాయ, ఆరోగ్య, వైద్య పరిశోధన, వ్యవసాయం, పాడి, మత్స్య మరియు జల వనరుల రంగంలో సహకారానికి అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. వీటితోపాటు ఒమన్, బెలారస్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి ముసాయిదా రోడ్‌మ్యాప్ పై సంతకాలు చేశారు. బెలారస్ లో కాగితం గుజ్జు ఉత్పత్తి చేసే పరిశ్రమను ఒమన్ స్థాపించనుంది. ఈ ప్రాజెక్ట్ రెండు దేశాల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీని కలిసిన భారత అంధుల క్రికెట్ జట్టు
- తిరుపతిలో 600 ఎకరాల్లో ఆధ్యాత్మిక టౌన్షిప్…
- సింగర్ మంగ్లీని దూషించిన వ్యక్తి అరెస్ట్
- 2045 నాటికి తెలంగాణలో 100% ఎలక్ట్రిక్ బస్సులు
- యూఏఈకి క్లీన్ చిట్ ఇచ్చిన టర్కీ..!!
- లులు కువైట్ ‘సూపర్ ఫ్రైడే’ ప్రారంభం..!!
- సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాలు..ఖండించిన ఒమన్..!!
- దోహా మెట్రో వర్కింగ్ అవర్స్ పొడిగింపు..!!
- మక్కాలో 1300 కి పైగా వర్క్‌షాప్‌లు మూసివేత..!!
- ఆన్లైన్లో మైనర్ పై లైంగిక వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!







