ఈ వీకెండ్ లో కార్నిచ్ స్ట్రీట్‌ మూసివేత..!!

- October 07, 2025 , by Maagulf
ఈ వీకెండ్ లో కార్నిచ్ స్ట్రీట్‌ మూసివేత..!!

దోహా: అల్-కార్నిచ్ స్ట్రీట్‌ ను తాత్కాలికంగా మూసివేయనున్నారు.  రోడ్డు అభివృద్ధి పనులను నిర్వహించడానికి వీలుగా మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'అష్ఘల్' ప్రకటించింది.

ఓల్డ్ దోహా పోర్ట్ నుండి అల్-దివాన్ ఇంటర్‌చేంజ్ వరకు ఉన్న ఇంటర్ ఛేంజ్ రెండు దిశలలో మూసివేయబడుతుందని అష్ఘల్ ప్రకటించింది. అక్టోబర్ 9 రాత్రి 10 గంటల నుండి అక్టోబర్ 12 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది.  వాహనదారులు ప్రత్యామ్యాయ రహదారులను ఉపయోగించాలని అష్ఘల్ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com